ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీకి వేర్వేరుగా శుక్రవారం ఉదయం లేఖలు రాశారు. హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులకు సమాన అవకాశాలు ఇచ్చే విధంగా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను ఆయన తెలిపారు. అలాగే రాష్ట్రపతికి రాసిన లేఖలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ ప్రధాని పివి నరసింహారావు స్మారక తపాలా స్టాంప్‌నకు త్వరగా అనుమతివ్వాలని కోరారు.