ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ భేటీలో కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో కరోనా కట్టడికి మరిన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందించే సేవలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే కరోనా వ్యాప్తి నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నందున్న.. ఈ ప్రత్యేక కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌పై ఆర్డినెన్స్‌ను ఆమోదించనున్నారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ ఈ భేటీలో సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. అందుకోసం కేబినెట్ హాల్‌లో కాకుండా కాన్ఫరెన్స్ హాలులో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎంలు, మంత్రులు, సీఎస్‌ల వ్యక్తిగత సిబ్బందిని కేబినెట్ హాల్‌కు రాకుండా ఆదేశాలు జారీచేశారు.

ప్రారంభమైన ఏపీ కేబినెట్ ప్రత్యేక సమావేశం