ప్రియుడితో కలిసి గోవా ట్రిప్‌లో నయనతార!

కథానాయిక నయనతార ప్రస్తుతం గోవా ట్రిప్‌లో ఉన్నారు. ఈ ట్రిప్‌ను ఫుల్‌గా ఎంజారు చేస్తోందట అమ్మడు. సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటలోను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. గత కొన్నేళ్లుగా నయనతార, విఘ్నేశ్‌ ప్రేమలో ఉన్నట్లు వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఈ విషయాన్ని ఇద్దరూ మీడియా ముందు పరోక్షంగా చెప్పారనుకోండి. నయన్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను విఘ్నేశ్‌ తరుచూ పోషల్‌మీడియాలో షేర్‌ చేస్తుండటం కూడా వీరి బంధానికి బలం చేకూరుస్తున్నాయి. ఆ ఫొటోలు చూసిన వారెవరైనా ఇట్టే చెప్పేస్తారు వారు రిలేషన్‌లో ఉన్నారని. ఇప్పుడు విఘ్నేశ్‌ కుటుంబసభ్యులతో కలిసి నయనతార గోవా ట్రిప్‌ భలే ఎంజారు చేస్తోంది. విఘ్నేశ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోలు ట్విటర్‌లో బాగా ట్రెండ్‌ అవుతున్నాయి.