సమంత నటిగాను కాదు మంచి సోషల్ యాక్టివిస్ట్ అనే సంగతి మనందరికి తెలిసిందే. ప్రత్యూష అనే స్వచ్చంద సంస్థ ద్వారా ఎంతో మంది చిన్నారులకి అండగా నిలుస్తున్న సమంత త్వరలో ప్రీ స్కూల్ ప్రారంభించబోతుంది. శిల్పా రెడ్డితో పాటు ప్రముఖ విద్యావేత్త ముక్తా ఖురానాతో కలిసి ఏకం లెర్నింగ్ సెంటర్‌ని ప్రారంభించబోతుంది సమంత. ఫిబ్రవరి 22న ప్రీ స్కూల్ ఏకం లెర్నింగ్ సెంటర్ తలుపులు తెరవబోతున్నాయని నటి వెల్లడించింది. జూబ్లిహిల్స్‌లోని ఈ ప్రీస్కూల్ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు ఎంతగానో దోహదపడుతుందని సామ్ స్పష్టం చేశారు. సంవత్సరానికి పైగా ఈ స్కూల్ కోసం పనిచేశాం. ఎట్టకేలకి తమ కల నెరవేరిందని భావోద్వేగంతో తెలియజేసింది సామ్. ఈ స్కూల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్టు సమంత తన పోస్ట్‌లో తెలిపింది.
