నిత్యావసరాలను అధిక రేట్లకు అమ్మే వ్యాపారులను బతిమాలడం మానుకొని కేసులు నమోదు చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. గురువారం స్థానిక రెవెన్యూ హాల్లో వ్యాపారస్తులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ వెంకట్రావ్‌తో కలిసి మంత్రి మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని అలీస్మార్ట్స్, హాష్మీ లాంటి మాళ్ల వద్ద భౌతికదూరం పాటించడం లేదని వాపోయారు. నిర్వాహకులు శానిటైజర్లను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. నిబంధనలు పాటించకుంటే 6 నెలలు దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. కోటా ఇండస్ట్రీస్‌లో పనిచేసేందుకు కార్మికులు రావడం లేదని యజమాని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వేతనాలు పెంచి కిరవచ్చేలా చూడాలన్నారు. లాభాపేక్షతో కాకుండా మానవతా దృక్పథంతో పని చేయాలన్నారు. కరోనా అనుమానితులకు ముద్ర వేసి క్వారంటైన్లో ఉంచాలన్నారు. వ్యాపారులకు ఎలాంటి సమస్య ఉన్నా తక్షణం పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

బతిమాలడం మాని చర్య తీసుకోండి-మంత్రి శ్రీనివాస్‌గౌడ్