బయోడైవర్సిటీ జంక్షన్‌లో 30.26 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫస్ట్‌లెవల్ ఫ్లైఓవర్‌ను మున్సిపల్‌శాఖమంత్రి కె. తారాకరామారావు గురువారం ప్రారంభించారు. హైదరాబాద్ నగరానికి తలమానికంగా దినదినాభివృద్ధి చెందుతున్న ఐటీ ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్ట్ ఏరియాలో పెరుగుతున్న వాహనాల రద్దీతో తరచూ నిలిచిపోతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమించడానికి ఎస్‌ఆర్‌డిపి ప్యాకేజీ కింద రూ. 379 కోట్లతో ఆరు పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిలో ఐదు పనులు గతంలోనే పూర్తిచేశారు. ఈ ప్యాకేజీలో చివరిదైన ఫస్ట్‌లెవల్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించడంతో జెఎన్‌టియు నుంచి బయోడైవర్సిటీ వరకు దాదాపు 12కి.మీ. కారిడార్‌వినియోగంలోకి వచ్చి ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోకు వెసులుబాటు కలిగింది.
