బాధ్యతల్ని స్వీకరించిన పలువురు మంత్రులు

 ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నూతన మంత్రి మండలి కొలువుదీరిన సంగతి తెలిసిందే. మంగళవారం పలువురు మంత్రులు ఆ శాఖల బాధ్యతల్ని స్వీకరించారు. సచివాలయం 2వ బ్లాక్‌లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పూజలు నిర్వహించి.. సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ, బిసి సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే విద్యాశాఖామంత్రిగా నియమితులైన బొత్ససత్యనారాయణ కూడా ఆ శాఖ బాధ్యతల్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌ డైరెక్టర్‌ దేవానందరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే రవాణాశాఖామంత్రిగా పి. విశ్వరూప్‌ బాధ్యతలు చేపట్టారు.