బాబు, లోకేష్ ఆంధ్రాకు ఎందుకు రావడం లేదు: అంబటి

హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు, లోకేష్‌లు ఆంధ్రాకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాంబాబు. చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని.. మీడియాలో కనిపించాలని, ప్రచారం కోసం బాబు ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. కరోనాపై పోరాటం చేస్తున్న అధికారుల్ని మానసికంగా దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

టీడీపీ నేతలు ఇళ్లల్లో కూర్చొని దీక్షలు చేస్తున్నారని.. ప్రజలు, ప్రముఖులు పేదలకు సహాయం చేస్తుంటే టీడీపీ నేతలు ఒక్కరైనా బయటకు వస్తున్నారా అని ప్రశ్నించారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కరోనా కట్టడికి తీవ్రంగా శ్రమిస్తున్నారని.. కరోనా టెస్టులు నిర్వహించడంలో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో ఉందన్నారు. ప్రభుత్వం పని తీరుకు ఇది నిదర్శనమని.. సీఎం జగన్‌కు పని చేయడం తప్ప ప్రచారం చేసుకోవడం రాదన్నారు అంబటి.