సినిమా ఇండిస్టీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీ మరో హీరో సినిమాగా తీసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి ఆసక్తికర పరిణామమే ఒకటి బాలకృష్ణ, గోపిచంద్ మధ్య జరిగింది. మొదట రూలర్ సినిమా కథను దర్శకుడు పరుచూరి మురళీ గోపిచంద్‌కు వినిపించాడు. కానీ గోపిచంద్ ఈ కధను రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత ఇదే కధతో బాలకృష్ణ కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్‌లో సినిమా తీశాడు. సినిమా బాక్సాఫీసు వద్ద బల్తా కొట్టింది. మరోవైపు దర్శకుడు తేజా అలివేలు వెరకటరమణ స్టోరీని బాలకృష్ణకు వినిపించాడు. ఆ కధను పక్కన పెట్టిన బాలకృష్ణ దర్శకుడు తేజాతో ఎన్టీయార్ బయోపిక్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత తేజా ఆ ప్రాజెక్ట్ నుండి వైదొలగిన విషయం తెలిసిందే. తేజా తాజాగా అలివేటు వెంకటరమణ స్టోరీని గోపిచంద్‌కు వినిపించాడు. దీనికి గోపిచంద్ గ్రీన్ సిగల్ ఇచ్చాడు. షూటింగ్‌లు మొదలైన తరువాత ఈ సినిమా పట్టాలు ఎక్కనుంది.
