బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో మరో ట్విస్ట్‌

బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు మరో మలుపు తిరిగింది. టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ కుమార్తె సారా అలీఖాన్‌, డిజైనర్‌ సిమోన్‌ ఖంబట్ట పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తి విచారణలో ఈ పేర్లు వెల్లడించినట్లు సమాచారం. దీంతో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) వీరిపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. వీరితోపాటు బాలీవుడ్‌లో కూడా నిఘా కొనసాగిస్తోంది. కాగా, తాను డ్రగ్స్‌ తీసుకోనని తొలుత చెప్పిన రియా.. ఆ తర్వాత తాను కూడా డ్రగ్స్‌ తీసుకుంటానని విచారణలో అంగీకరించిన సంగతి తెలిసిందే.