బాలు కడసారి చూపుకు వస్తున్న ప్రముఖులు

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయానికి కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బాలు ను కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు చెన్నై శివారులోని తామరైపాక్కం వ్యవసాయ క్షేత్రానికి భారీగా తరలివస్తున్నారు. సినీ ప్రముఖులు భారతీరాజా, దేవిశ్రీ ప్రసాద్‌, సింగర్‌ మనో, తదితరులు బాలు భౌతికకాయాన్ని కడసారి చూసి కన్నీటి నివాళులర్పించారు.

బాలు పార్థీవదేహాన్ని చూసిన మనో కన్నీటి పర్యంతమయ్యారు. భారీగా తరలివస్తున్న అభిమానులను నియంత్రించేందుకు తామరైపాక్కంలో 500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ పోలీసులతో వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నట్లు తిరువళ్లూరు ఎస్పీ తెలిపారు. కాసేపట్లో తామరైపాక్కం వ్యవసాయక్షేత్రంలోనే బాలు అంత్యక్రియలను నిర్వహించనున్నారు.