బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్..ఆ ఇద్దరూ డేంజర్ జోన్‌లో

నిజానికి తొలివారంలోనే కరాటే కళ్యాణి ఎలిమినేషన్‌కి నామినేట్ కానప్పటికీ.. చాలామంది ఆమె ఆటతీరుపై అసహనం వ్యక్తం చేశారు. కళ్యాణి తొలివారం జస్ట్ మిస్.. లేదంటే సీజన్ 3లో నటి హేమను పంపించినట్టుగానే తొలివారమే బ్యాగ్ సర్దించేవాళ్లమంటూ విపరీతంగా కామెంట్స్ వినిపించాయి. అయితే రెండో వారం నామినేషన్స్‌లోకి వచ్చిన తొమ్మది మందిలో కరాటే కళ్యాణి ఉండనే ఉంది. గంగవ్వ, నోయల్, కరాటే కళ్యాణి, మొనాల్ గజ్జర్, సొహైల్, అమ్మా రాజశేఖర్ కుమార్ సాయి, దేత్తడి హారిక, అభిజిత్‌‌లు రెండో వారం నామినేషన్స్‌లో ఉండగా.. వీరిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు.

అయితే ఈ తొమ్మిది మందిలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయానికి వస్తే.. ప్రేక్షకుల ఓటింగ్ నాడిని పట్టుకునేందుకు ఈ నామినేషన్స్‌కి సంబంధించి ప్రతి వారం ‘సమయం తెలుగు’లో పోల్ నిర్వహించడం జరుగుతుంది. గతవారం సూర్య కిరణ్ నామినేట్ కాబోతున్నాడనే విషయంతో పాటు.. గత మూడు సీజన్లలో ప్రతివారం ఎలిమినేషన్స్‌తో పాటు విన్నర్ ఎవరన్నదానిపై కూడా ఈ పోల్ ద్వారా ఖచ్చితమైన సమాచారం అందించారు ప్రేక్షకులు.

అయితే రెండో వారం నామినేషన్స్‌లో ఓటింగ్ సరళి ఎలా ఉంది? ప్రేక్షకుల నాడి ఎలా ఉందనే విషయంపై ‘సమయం తెలుగు’ పోల్‌ నిర్వహించగా కరాటే కళ్యాణి ఎలిమినేట్ కాబోతున్నట్టు స్పష్ఠంగా తెలుస్తోంది.