బిజెపి ఎంపి ఆత్మహత్య…!

హిమాచల్‌ ప్రదేశ్‌ బిజెపి ఎంపి రామ్‌ స్వరూప్‌ శర్మ (62) ఆత్మహత్య చేసుకున్నారు. ఢిల్లీలోని ఆయన నివాసంలోని గదిలో ఉరివేసుకుని కనిపించారని..ఆసుపత్రికి తరలించగా, చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. ఈ కేసును సూసైడ్‌ కోణంలో విచారణ చేపడుతున్నామని ఢిల్లీ పోలీస్‌ పిఆర్‌ఒ చిన్మరు బిశ్వాల్‌ చెప్పారు. మండి నుండి రెండవ సారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న శర్మది ఆత్మహత్యగా ప్రాథమిక విచారణలో నిర్థారణకు వచ్చామని పేర్కొన్నారు. కాగా, ఘటనాస్థలంలో ఎటువంటి ఆత్మహత్య నోటు దొరకలేదని తెలిపారు. బుధవారం ఉదయం శర్మ వ్యక్తిగత సహాయకుడు..తలుపులు కొట్టినా…ఎంపి తెరవకపోవడంతో…పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న పోలీసులు..తలుపులు పగలగొట్టి వెళ్లి చూడగా..శర్మ ఉరి వేసుకుని విగత జీవిగా కన్పించారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదని చెప్పారు.