బిజెపి పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ మనోజ్ ఝా
బిజెపి పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ మనోజ్ ఝా

బిజెపి పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ మనోజ్ ఝా

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు అని ఆర్జేడీ సీనియర్ నేత, ఎంపీ మనోజ్ ఝా వ్యాఖ్యానించారు. బీజేపీ విషపూరిత ప్రచారం ఢిల్లీ ఎన్నికల్లో పనిచేయలేదని ఇవి నిరూపించాయని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి బిహార్ లో కూడా రానుందని, మరికొన్ని రోజుల్లో దేశమంతటా ఇదే పరిస్థితి రానుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఆర్జేడీ నాలుగు స్థానాల్లో పోటీ చేసింది. తాము ఈ ఫలితాలతో నిరాశ చెందడం లేదని, ప్రజలు తమ తీర్పునిచ్చారని, తాము గౌరవిస్తామని ఆయన స్పష్టం చేశారు.