గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో ఫాస్ట్రక్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు శిశికృష్ణకు ఉరి శిక్ష విధిస్తూ… జడ్జిమెంట్ ఇచ్చింది. గతేడాది గుంటూరు పరమాయికుంటకు చెందిన రమ్యను… శిశికృష్ణ కత్తితో పొడిచి హత్య చేశాడు. తనను ప్రేమించడం లేదని… ఫోన్ నంబర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టిందన్న కోపంతో గతేడాది ఆగస్టు 15న నడిరోడ్డుపైన అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. ఈ కేసుపై దాదాపు 5 నెలలు విచారించిన ప్రత్యేక న్యాయం స్థానం… నిందితుడికి ఉరిశిక్ష వేస్తూ తీర్పునిచ్చింది.
