బీజేపీలో చేరిన సింధియా
బీజేపీలో చేరిన సింధియా

బీజేపీలో చేరిన సింధియా

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కేంద్ర మాజీమంత్రి, గ్వాలియర్‌ రాజవంశస్తుడు జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్‌ జేపీ నడ్డా సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమానికి పలువురుకు కేంద్రమంత్రులతో సహా, బీజేపీ పెద్దలు హాజరయ్యారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో ఉన్న విభేదాల కారణంగా మంగళవారం కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. పార్టీలో సరైన ప్రాతినిధ్యం లభించడంలేదని భావించిన సింధియా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌ షా భేటీ అనంతరం హస్తం పార్టీకి రాజీనామా సమర్పించారు.