మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్ వివాహ వేడుక శుక్రవారం హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా ఘనంగా జరిగింది. కదిరి బాలకృష్ణ కుమార్తె పూజితను సందీప్ వివాహమాడారు. ఈ వేడుకకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతి దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.
