బోయపాటి, రామ్‌ సినిమా ప్రారంభం

రామ్‌ హీరోగా, బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమాను బుధవారం ప్రారంభించారు. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ.. ‘బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. మా సంస్థలో ప్రతిష్టాత్మక చిత్రమిది. భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో చేయబోతున్నాం. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తాం. ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడిస్తాం’ అని తెలిపారు.