బ్రదర్ అనిల్ కుమార్ కు తప్పిన ప్రమాదం
బ్రదర్ అనిల్ కుమార్ కు తప్పిన ప్రమాదం

బ్రదర్ అనిల్ కుమార్ కు తప్పిన ప్రమాదం

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్టు వద్ద కారు ప్రమాదం జరిగింది. బ్రదర్ అనిల్ కుమార్ తో పాటు డ్రైవర్, గన్ మెన్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. బ్రదర్ అనిల్ కుమార్ కు తృటిలో ప్రమాదం తప్పింది. రాత్రి తన పర్యటనను ముగించుకుని బ్రదర్ అనిల్ కుమార్ వెళ్తుండగా మార్గంమధ్యలో కారు అదుపు తప్పి రోడ్డుపై నుంచి కిందికి వెళ్లింది. డ్రైవర్ అప్రమత్తమై గోతిలోకి వెళ్తున్న కారును మళ్లించారు. వెంటనే అనిల్, తన డ్రైవర్.. సహచరులకు ఫోన్ చేయడంతో స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయ భానుఅక్కడకు చేరుకున్నారు.ఘటనాస్థలానికి చేరుకున్న సామినేని ఉదయ భాను తన కారులో అనిల్ ను వెంటనే విజయవాడలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు అతనికి చికిత్స అందించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆయన అక్కడి నుంచి వెళ్లి పోయారు.