భారత్‌లో కొత్తగా 8,392 కరోనా కేసులు

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతోంది. నిన్న 8,380 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా నిన్నటి కంటే ఎక్కువగా 8,392 కొత్త కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 230 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,90,535కు చేరింది. ఈ మేరకు సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 91,819మంది కరోనానుంచి కోలుకుని డిశ్చార్జవ్వగా.. దాదాపు 93వేల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,394గా ఉంది.