భారత్‌లో కొత్తగా 9,851 కేసులు

భారత్‌లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి కేసులు సంఖ్య రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మరణాలు కూడా ప్రతి రోజు 200 పైగా సంభవిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే దాదాపు 10 వేల కేసులు వెలుగుచూశాయి. గడిచిన 24 గంటల్లో 9,851 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా, 273 మంది మృత్యువాత పడ్డారు. ఒకేరోజు ఈ సంఖ్యలో కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటి వరకు దేశంలో 2,26,770 కరోనా కేసులు నమోదవ్వగా.. 6,348 మంది ప్రాణాలు విడిచారు. కరోనా నుంచి కోలుకొని 1,09,462 మంది డిశ్చార్జి అయ్యారు