భారత్‌లో చైనాను దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య చైనాను దాటిపోయింది. చైనాలో ఇప్పటి వరకు 82,933 కేసులు నమోదు కాగా భారత్‌లో 85,940 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 3,970 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదవగా, 103 మంది మఅతి చెందారు. కరోనా నుండి కోలుకోని 30,153 మంది డిశ్చార్జ్‌ కాగా, 2,752 మంది మఅతి చెందారు. దేశవ్యాప్తంగా 53,035 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దీంతో అధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ 11వ స్థానంలో నిలిచింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 46.19 లక్షలు దాటింది. ఇప్పటి వరకు వైరస్‌ సోకి 3.08 లక్షల మంది మఅతి చెందారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా నుండి 17.54 లక్షల మంది కోలుకున్నారు.