భారత్లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లలో భారత్లో 73 మందిని కరోనా బలి తీసుకంది. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1007కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు భారత్లో 31,332 కరోనా కేసులు నమోదయ్యాయని తెలిపింది. 7,695 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం దేశంలో 22,629 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వెల్లడించింది.

భారత్లో వెయ్యి దాటిన కరోనా మరణాలు