‘అసాధరణ సమయాల్లో స్నేహితుల మధ్య పరస్పర సహకారం ఎంతో అవసరం. హైడ్రాక్సీక్లోరోక్విన్‌పై భారత ప్రజలు తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు. ఈ మేలు మర్చిపోము! భారత్‌ను ముందుకు నడిపించే మీ బలమైన నాయకత్వం.. ఈ యుద్ధంలో మానవతా దృక్పథం అవలంబిస్తున్న తీరుకు మోదీకి కృతజ్ఞతలు’’అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నారు. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడంలో సత్ఫలితాలను ఇస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ సరఫరా చేసినందుకు ధన్యవాదాలు తెలిపారరు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కాగా కరోనాతో అల్లాడుతున్న దేశాలకు మానవతా దృక్పథంతో అత్యవసరమైన మందులు సరఫరా చేస్తామని భారత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనాతో అతలాకుతలం అవుతున్న అమెరికాకు దాదాపు 29 మిలియన్ డోసుల హైడ్రాక్సీక్లోరోక్విన్ ను ఎగుమతి చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్..‘‘సమస్యలు తలెత్తిన తరుణంలో మా అభ్యర్థనను మన్నించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. ఆయన అద్భుతమైన వ్యక్తి. మేము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాం’’ అని పేర్కొన్నారు.
