భారీ బడ్జెట్‌తో ఇంటి సెట్‌ నిర్మాణం

 మహేష్‌ బాబు ఇప్పుడు ‘సర్కారు వారి పాట’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా తరువాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌ కోసం దర్శకనిర్మాతలు ఒక పెద్ద ఇంటి సెట్‌ని సిద్ధం చేస్తున్నారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎస్‌ ప్రకాష్‌ దాదాపు రూ.5 కోట్ల బడ్జెట్‌తో ఈ ఇంటి సెట్‌ని నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. థమన్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.