భారీ విరాళం ప్రకటించిన ప్ర‌భాస్‌
భారీ విరాళం ప్రకటించిన ప్ర‌భాస్‌

భారీ విరాళం ప్రకటించిన ప్ర‌భాస్‌

యావ‌త్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిని త‌రిమి కొట్ట‌డానికి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు త‌మ వంతు నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టాయి. దేశం యావ‌త్తు లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించారు. ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల కోసం కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల కోసం విరాళాల‌ను అందిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు స్టార్స్ క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల కోసం విరాళాల‌ను అందిస్తున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్, నితిన్‌, త్రివిక్ర‌మ్‌, దిల్ రాజు, సాయితేజ్, అల్లరి నరేష్ వంటి ప్రముఖులెందరో ఇప్పటికే తమ వంత సాయం ప్రకటించారు. తాజాగా యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఆశ్చర్యపరిచేలా విరాళం ప్రకటించి.. ఇలా విరాళం ఇచ్చిన వారిలో ప్రథమ స్థానాన్ని పొందారు.క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌ నిమిత్తం ముందు ఆయన రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి రూ. కోటి రూపాయలు ప్రకటించారు. ఈ రూ. కోటి విరాళం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి ఇవ్వనున్నట్లుగా ఆయన తెలియజేశారు. తాజాగా ఆయన ప్రధానమంత్రి సహాయనిధికి రూ. 3 కోట్ల విరాళం ఇస్తున్నట్లుగా ప్రకటించారు.