భీష్మ’ సినిమా పేరును మార్చాలని డిమాండ్

భీష్మ’ సినిమా పేరును మార్చాలని డిమాండ్

ఆ జన్మ బ్రహ్మచారి భీష్మ పితామహుడి గురించి భీష్మ సినిమాలో వక్రీకరించారని, సినిమా పేరును, కథానాయకుడి పేరును మార్చాలని బెస్తగూండ్ల (గంగపుత్ర) చైతన్య సమితి అధ్యక్షుడు పూస సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. బుధవారం సోమాజీగూడా ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి ప్రధాన కార్యదర్శి ఎం.శంకర్‌, శివసేన రాష్ట్రనాయకులు సుదర్శన్‌తో కలసి ఆయన మాట్లాడారు. ఈ నెల 21న భీష్మ చలనచిత్రం విడుదల కానుందని దీనిలో గంగపుత్ర కుల పితామహుడు భీష్మా చార్యుని వ్యక్తితత్వం కించపరిచే విధంగా కథానాయకుడి పాత్రను తీర్చిదిద్దారని ఆరోపించారు.