ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి తమ పెద్ద మనసు చాటుకున్నారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద వేట నిషేధ భృతి చెల్లింపులను బుధవారం సీఎం వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్‌తోపాటు మంత్రి మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని హాజరు అయ్యారు. వివిధ జిల్లాల నుంచి కలెక్టర్లు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్