మరింత బెటర్‌గా పుష్ప-2

అల్లు అర్జున్‌, హీరోయిన్‌ రష్మిక మందన్న నటించిన చిత్రం పుష్ప. డిసెంబర్‌ నెలలో విడుదలై మంచి విజయం సాధించింది. మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలో రష్మిక సోషల్‌మీడియాలో స్పందించారు. సినిమా విజయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ…’ మేము మీకు వాగ్దానం చేస్తున్నాం, పుష్ప సీక్వెల్‌ మరింత బెటర్‌గా, బిగ్గరగా ఉంటుందని ప్రామిస్‌ చేస్తున్నా.. మీ ప్రేమ మరింత కష్టపడేలా చేస్తుంది’ అని పోస్టు చేసింది.