మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించునున్న మోదీ
మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించునున్న మోదీ

మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించునున్న మోదీ

కరోనా కట్టడికి దేశ వ్యాప్తింగా విధించిన లాక్‌డౌన్‌ మే 17తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ప్రజల ముందుకు రానున్నారు. ఈ రోజు (మంగళవారం) రాత్రి 8 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడనున్నారు. లాక్‌డౌన్ సడలింపులు, కొనసాగింపు, కరోనా కట్టడిపై ప్రధాని ప్రసంగించే అవకాశం ఉంది. సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని దృష్టికి సీఎంలు అనే సమస్యలను తీసుకువచ్చారు. దీంతో నేటి ప్రసంగంలో వాటిపై మాట్లాడే అవకాశం ఉంది.