మరో నటుడికి కరోనా

మలయాళ నటుడు జయరామ్‌కి కరోనా సోకింది. ఇటీవల మమ్ముట్టి, దుల్కర్‌ సల్మాన్‌, సురేష్‌ గోపీలు కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. నిన్న (శనివారం) తనకి కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అయినట్టు సోషల్‌ మీడియాలో ప్రకటించారు. తనకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిందని, వైరస్‌ ఇంకా మనతోనే ఉందని, మనకు గుర్తు చేస్తోందని అన్నారు. తనతో కాంటాక్ట్‌ లో ఉన్నవారు ఐసోలేట్‌ అవ్వాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నట్లు ట్వీట్‌చేశారు. తాను ట్రీట్‌ మెంట్‌ మొదలు పెట్టానని, త్వరలోనే మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని అన్నారు. జయరామ్‌ భాగమతి, అల వైకుంఠపురములో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించారు.