మాట నిలబెట్టుకున్న కేటీఆర్‌

ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ఆరు కోవిడ్‌ రెస్పాన్స్‌ అంబులెన్సులను ప్రభుత్వానికి అందజేశారు. తన జన్మదినం సందర్భంగా ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’పేరిట ఇచ్చిన నినాదంలో భాగంగా సొంత డబ్బుతో అంబులెన్సులు అందజేస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి కేటీఆర్‌ అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభించారు. కేటీఆర్‌ భార్య శైలిమ, కుమార్తె అలేఖ్యతో పాటు పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, తాము కూడా త్వరలోనే అంబులెన్సులను అందజేస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు వెల్లడించారు.