మాడపాటి సత్యవతి కన్నుమూత
మాడపాటి సత్యవతి కన్నుమూత

మాడపాటి సత్యవతి కన్నుమూత

రేడియోలో వార్తలు చదువుతూ శ్రోతల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మాడపాటి సత్యవతి(80) కన్నుమూశారు. తన సుస్వరంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె బుధవారం తెల్లవారు జామున రెండు గంటలకు తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం తిరుమల్‌గిరి శ్మశాన వాటికలో మాడపాటి సత్యవతి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా తన గా​‍త్రంతో న్యూస్‌ రీడర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సత్యవతి 2017లో తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తమ మహిళ పురస్కారం అందుకున్నారు.