మాలాశ్రీ భర్త కోవిడ్‌తో మృతి

శాండిల్‌వుడ్‌లో విషాదం నెలకొంది. కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖ నిర్మాత, ప్రముఖ సినీనటి మాలాశ్రీ భర్త రాము (52) కోవిడ్‌తో సోమవారం తుదిశ్వాస విడిచారు. కోవిడ్‌ బారిన పడ్డ ఆయన..బెంగళూరులోని రామయ్య ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూనే కన్నుమూశారు. ఆయన ఎకె 47, లాకప్‌ డెత్‌, సిబిఐ దుర్గ, కలాసిపాల్యా వంటి 37 చిత్రాలను నిర్మించారు. ఆయన నిర్మించిన చిత్రాల బడ్జెట్‌ కోటి కన్నా ఎక్కువ ఉండటం వల్ల కోటి రామ్‌ అని పేరు కూడా ఉంది. రాము, మాలాశ్రీ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆయన మృతికి కన్నడ ఇండిస్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కన్నడ స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌తో పాటు పలువురు ఆయనకు ట్విట్టర్‌ వేదికగా సంతాపం తెలిపారు.