ముంచుకొస్తున్న తుపాన్‌..!

భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. తుపాను ముప్పు ముంచుకొస్తుంది. మే 14 నాటికి అరేబియా సముద్రంలో అల్ప పీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని, మరికొద్ది రోజుల్లో తుపాన్‌ వచ్చే సంకేతాలు ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది క్రమంగా ఈ నెల 16 నాటికి బలపడి వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని, బలపడిన అల్పపీడనం క్రమంగా తుపానుగా మారే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించింది.