క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికనే రంజాన్ పర్వదినం అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆయన ఆదివారం రాజ్భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం ‘ఈద్ ఉల్ ఫితర్’ ముగిసిన శుభవేళ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర ఖురాన్ బోధనలు యుగ యుగాలుగా మానవాళిని ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. రంజాన్ మాస పవిత్రతతో ప్రతి వ్యక్తి మానసిక పరివర్తన చెంది ప్రేమమూర్తిగా మారుతాడని ఆయన అన్నారు.రంజాన్ మాసంలో ఆధ్యాత్మిక ఆరాధనతో అనుబంధం మరింత బలపడుతుందని గవర్నర్ చెప్పారు. క్రమశిక్షణను అనుసరిస్తూ శాంతి, సౌభ్రాతృత్వాన్ని లోకానికి చాటడంలో రంజాన్ మాసం ప్రత్యేకంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. కఠోర ఉపవాసవ్రతం సహనాన్ని పెంచుతుందని గవర్నర్ తెలిపారు. రంజాన్ పండుగ వేళ ఇస్లాంను గౌరవించే ప్రతి ఒక్కరి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిసస్తునన్నానని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు.
