ఉద్యోగ విరమణ అనంతరం కొన్నేండ్ల తర్వాత పూర్తి పెన్షన్ వచ్చే విధానాన్ని ఎంచుకున్న వారికి వచ్చే నెల నుంచి ఆ మేరకు చెల్లించనున్నట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తెలిపింది. దీనివల్ల 6,30,000 మంది లబ్ధి పొందుతారని పేర్కొంది. ఈపీఎఫ్‌వో సభ్యులు ఉద్యోగ విరమణ అనంతరం పొందే నెలవారీ పెన్షన్ నుంచి కొంత తగ్గించుకుని కొంత కాలం (15 ఏండ్ల) తర్వాత పూర్తి పెన్షన్ పొందే విధానాన్ని ఉద్యోగ విరమణ సందర్భంగా ఎంచుకునే అవకాశమున్నది. ఆ గడువు ముగిసిన తర్వాత వారికి ఆ మేరకు పూర్తి పెన్షన్‌ను చెల్లిస్తారు. గతంలో రద్దు చేసిన ఈ విధానాన్ని గత ఏడాది పునరుద్ధరించిన కేంద్ర ప్రభుత్వం, దీనికి సంబంధించి ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది.
