మోడీని కలుసుకోనున్న కేజ్రీవాల్
మోడీని కలుసుకోనున్న కేజ్రీవాల్

మోడీని కలుసుకోనున్న కేజ్రీవాల్

ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారంనాడు కలుసుకోనున్నారు. పార్లమెంటు ఆవరణలోని ప్రధాని కార్యాలయంలో మధ్యాహ్నం 11 గంటలకు కేజ్రీవాల్ ప్రధానిని కలుస్తారు. కేజ్రీవాల్ మూడోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధానిని కలుసుకోనుండటం ఇదే మొదటిసారి. ఈశాన్య ఢిల్లీని అట్టుడికించి 47 మంది మృతికి దారితీసిన అల్లర్ల తర్వాత ప్రధానితో ఆయన సమావేశవుతుండటం కూడా ఇదే ప్రథమం.