మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌

కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని, ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ వ్యాఖ్యలు చేశారు. కరోనాపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, భయం, ఆందోళన తొలగించడం ద్వారానే సాధారణ పరిస్థితులు వస్తాయని చెప్పారు. ఏపీలో 3 సార్లు సమగ్ర సర్వే జరిగిందని మోదీతో జగన్‌ చెప్పారు. కేంద్రం ఇచ్చిన సూచనల వల్లే కేసుల్ని నియంత్రించగలిగామన్నారు. కోవిడ్‌ను నియంత్రించలేకపోతే ముందుకు వెళ్లలేమని మోదీకి జగన్ వివరించారు. కరోనా లక్షణాలు ఉన్నా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చెప్పట్లేదని, అవసరమైన శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని జగన్‌ చెప్పారు.