మోహన్‌బాబు చేతికి ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’

ఆహా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆండ్రాయిడ్‌ కట్టప్ప’ సినిమా రీమేక్‌ హక్కులను మోహన్‌బాబు సొంతం చేసుకున్నారు. ఆ సినిమాలో ప్రధానపాత్రధారిగా కనిపించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. కథ ప్రకారం విదేశాల్లో ఉన్న కొడుకు తండ్రి బాగోగులు చూసుకునేందుకు ఓ రోబోను సిద్ధం చేస్తాడు. కొడుకు స్థానంలో వచ్చిన ఆ రోబోపై తండ్రి చాలా అభిమానం పెంచుకుంటాడు. సినిమాలో వృద్ధుడికి, రోబోకు మధ్య చాలా ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయి. ఆ వృద్ధుడి పాత్రలోనే మోహన్‌ బాబు నటిస్తారు.