యోగి ఆదిత్యనాథ్‌ కి ప్రియాంక గాంధీ లేఖ

కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో రైతులు, కార్మికులు, ఎంఎన్ఆర్‌ఈజీఏ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కోరారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ చట్టం కింద వర్కర్లకు రేషన్ అందజేస్తుండటాన్ని ఆమె అభినందించారు. అసంఘటిత రంగ కార్మికులకు కూడా ఆర్థిక సాయం అందజేయాలని కోరారు. ఈ మేరకు యోగి ఆదిత్యానాథ్‌కు ప్రియాంక ఒక లేఖ రాశారు.