టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రంజాన్ పండుగ సందర్భంగా.. అభిమానులకు, శ్రేయోభిలాషులకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆయన కరోనాబారినపడి హోం ఐసోలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే రంజాన్ విషెతోపాటు తన ఆరోగ్యం గురించి కూడా చెప్పుకొచ్చారు. ‘అందరికీ ఈద్ శుభాకాంక్షలు.. అలాగే మీ స్పెషల్ గ్రీటింగ్స్ అండ్ ప్రేయర్లకు థ్యాంక్యూ. నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను. త్వరలోనే నెగటివ్ వస్తుందని నమ్మకంతో ఉన్నాను. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్…ఆర్ఆర్ఆర్ మూవీలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ అయిన తర్వాత కొరటలాల శివ దర్శకత్వంలో తదుపరి చిత్రంలో నటించనున్నారు.
