రంజాన్ ప్రార్థనలను ఇంట్లోనే జరుపుకోవాలి -ఏపీ గవర్నర్
రంజాన్ ప్రార్థనలను ఇంట్లోనే జరుపుకోవాలి -ఏపీ గవర్నర్

రంజాన్ ప్రార్థనలను ఇంట్లోనే జరుపుకోవాలి -ఏపీ గవర్నర్

రంజాన్ ప్రార్ధనలు ఇంటి వద్ద నుంచే నిర్వహించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కోరారు. నేడు ఆయన పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ గ‌వ‌ర్న‌ర్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం దేశం క్లిష్ట దశలో ఉందని, కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడంలో అన్ని వర్గాల ప్రజలు అధికారులతో సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం జనాభాను ప్రభావితం చేసిన కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు