రష్మికకు గూగుల్‌ గుర్తింపు

నటి రష్మిక మడన్నాకు గూగుల్‌ ఇండియా అరుదైన గుర్తింపునిచ్చింది. గూగూల్‌ 2020 సంవత్సరానికి గాను ‘నేషనల్‌ క్రష్‌ ఆఫ్‌ ఇండియా’గా రష్మిక ఎన్నికైనట్టు ప్రకటించింది. గూగుల్‌లో ఈ పదాన్ని టైప్‌ చేస్తే రష్మిక పేరుతో పాటు ఆమెకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. రష్మిక డ్రస్సింగ్‌ స్టైల్‌ నచ్చడం వల్లే ఆమెకి ఈ గుర్తింపు వచ్చిందని గూగుల్‌ సమాచారం. ఆమె నటించిన తెలుగు, కన్నడ సినిమాలు ఇతర భాషల్లో కూడా డబ్‌ అయి విడుదల కావడంతో ఆమెకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందట.