రహస్యంగా పెళ్లి చేసుకున్న ప్రభుదేవా

 ప్రభుదేవా రహస్యంగా రెండో వివాహం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రభుదేవా.. తన బంధువుల అమ్మాయినే ప్రేమించినట్లు.. ఆమె కూడా ఆయన ప్రేమను అర్థం చేసుకొన్నదని.. త్వరలోనే వారిద్దరూ వివాహం చేసుకోకున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేశాయి. కాగా, తాజా సమాచారం ప్రకారం ఊహించని విధంగా.. ప్రభుదేవా సెప్టెంబరులోనే బీహార్‌కు చెందిన ఫిజియోథెరపిస్ట్‌ను పెళ్లి చేసుకున్నారని సమాచారం. గతంలో ఆయన వెన్నుముక సమస్యతో బాధపడుతుండగా ఫిజియోథెరపీ చికిత్స చేయించుకున్నారు. ఆ క్రమంలో ఫిజియోథెరపిస్ట్‌తో ప్రేమలో పడ్డారట. కొంతకాలం డేటింగ్‌ చేసిన తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారట. అయితే ఈ వార్తలపై ప్రభుదేవా సంబంధిత వర్గాలేవీ స్పందించలేదు.