రాగల 4, 5 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు..

రాగల 4, 5 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. ఐఎండి వాతావరణ సూచనల మేరకు.. రాగల నాలుగైదు గంటలు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు పలుచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు హెచ్చరించారు.