రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించింది -జివిఎల్
రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించింది -జివిఎల్

రాజధాని అంశం రాష్ట్రానికి సంబంధించింది -జివిఎల్

రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. కేంద్ర నాయకత్వం సూచన మేరకే అమరావతిపై తను ప్రకటన చేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఢిల్లీలో జీవీఎల్‌ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌ సీఎం ప్రకటనతో రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోదేనని మరోసారి తేలిపోయిందన్నారు. సీఆర్‌డీఏ చట్టం ద్వారా రైతుల భూముల సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను మభ్యపెట్టవద్దని హితవు పలికారు. పీపీఏల రద్దు అంశంలో కూడా కేంద్రం నేరుగా జోక్యం చేసుకోలేదని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఒప్పందాలు చేసుకునే వ్యవస్థ ఉండాలని మాత్రమే గోయల్‌ సూచించారని తెలిపారు