రాజస్థాన్‌లో కరోనాతో ఒకరు మృతి

కరోనా వైరస్ బారిన పడిన ఇటాలియన్ పర్యాటకుడు రాజస్థాన్‌లోని జైపూర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భారత్‌లో తొలిగా వెలుగుచూసిన కరోనా పాజిటివ్ కేసుల్లో ఈ ఇటాలియన్ పర్యాటకుడు ఒకరు. ఇదిలా ఉంటే.. శుక్రవారం లక్నోలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పంజాబ్‌లోని మొహాలీలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఉత్తరాఖండ్‌లో ఇద్దరు ఐఎఫ్ఎస్ ట్రైనీస్ కరోనా బారిన పడినట్లు తెలిసింది. . మొత్తం మీద.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారత్‌లో ఇప్పటివరకూ 195కు చేరుకుంది.