రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 17 రాష్ట్రాల నుంచి 55 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

– మార్చి 6న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌

– నామినేషన్ల స్వీకరణకు మార్చి 13న తుదిగడువు

– మార్చి 16న రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన

– నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 18 తుది గడువు

– మార్చి 26న రాజ్యసభ స్థానాలకు పోలింగ్‌

– ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.