రాత్రి సమయంలో షూటింగ్‌కి అనుమతి

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం రాత్రి సమ యంలో కర్ఫ్యూ విధించింది. దీనివల్ల చిత్ర షూటింగ్స్‌ వాయిదా పడ్డాయి. కానీ హీరో రజనీకాంత్‌ నటిస్తున్న అన్నాత్తె చిత్ర షూటింగ్‌ కోసం చిత్రబృందం పోలీసుల నుంచి ప్రత్యేక అనుమతికి ప్రయత్నిస్తుంది. ఈ చిత్ర షూటింగ్‌ కోసం రజనీకాంత్‌ ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుగుతుంది. వీలైనంత త్వరగా షూటింగ్‌ పూర్తి చేసి దీపావళికి చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తుంది.